వ్యాయామంతోనే ఆరోగ్య పరిరక్షణ


Mon,August 19, 2019 03:39 AM

ఎల్కతుర్తి : ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో అవసరమని జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని దండేపల్లి నుంచి వల్భాపూర్ వరకు 5కే రన్ నిర్వహించారు. మొదటగా ఈ రన్‌ను డీసీపీ కేఆర్ నాగరాజు, ఏసీపీ నర్సింగరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడారు. ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతీ పౌరుడు కష్టపడి సాధించిన సొమ్ముని వైద్య ఖర్చుల కోసం కాకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్య భారత్ నిర్మించాలని, ఆ దిశగా డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వేరో ఆలోచలను ముందుకు తీసుకెళ్తున్న ఫిట్ ఇండియా ఫౌండేషన్‌ను అభినందించారు. 5కే రన్‌లో విజయం సాధించిన యువకులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే వల్భాపూర్ పాఠశాలలో హరితహారంలో భాగంగా 500 మొక్కలు నాటారు. గ్రామస్తులకు హెల్త్ క్యాంపు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా వ్యవస్థాపకుడు సదన్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నం మధు, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్‌లు అంబాల మమత, పుట్ట ప్రమీలప్రతాప్, ఎంపీటీసీ బోడ అనూష, బోయినపల్లి భవాని, శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, పుట్ట ప్రతాప్, నాస్తిక్ రాకేశ్, దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...