తల్లికి బోనం


Mon,August 19, 2019 03:39 AM

-గ్రామ దేవతకు శ్రావణ పూజలు
-తరలివచ్చిన భక్తులు
-శివసత్తుల పూనకాలతోహోరెత్తిన ఆలయాలు
-చీరె సారె, కల్లు, బెల్లం పానకంతో మొక్కులు
కరీమాబాద్/భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, ధర్మసాగర్: శ్రావణం..ఆధ్యాత్మికం వెల్లివిరిసే మాసం. ఆలయాల్లో ప్రతీ రోజు ప్రత్యేక పూజ లు. అతిపవిత్రంగా భావించే ఈ మాసంలో మహిళలు ప్రతీ రోజును ప్రత్యేకంగా చూస్తారు. ఇక గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోం ది. బుధ, ఆదివారాల్లో అమ్మకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకుంటారు. శివసత్తుల పూనకాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం జిల్లా వ్యాప్తం గా బోనాల సందడి నెలకొంది. ఊళ్లన్నీ..బోనాలెత్తాయి. ఊరిని, పిల్లపాపలను, పాడిపంటలను చల్లంగా చూడమంటూ వేడుకున్నారు. భక్తితో వండిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ పట్టణంలోని అండర్ రైల్వే గేట్, స్టేషన్ రోడ్డులోని పోచమ్మ ఆలయంలో ప్రాంతాల్లోని అన్ని వాడలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కాశికుంటలోని పోచమ్మ తల్లి ఆలయంలో కార్పొరేటర్ మేడిది రజిత ప్రత్యేక పూజలు చేశారు. భీమదేవరపల్లి ములకునూరులో పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఎల్కతుర్తి మండలంలోని సూరారంలోనూ తల్లికి బోనం వండి నైవే ద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, తంగెడ మహేందర్, తదితరులు పాల్గొన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో పోచమ్మ తల్లి బోనాలు వైభవంగా జరిగాయి. ధర్మసాగర్ మండల కేంద్రంలో, వేలే రు మండలంలోని సోడషపెల్లి, వేలేరు గ్రామం లో తల్లికి బోనాలు సమర్పించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...