ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం


Mon,August 19, 2019 03:38 AM

-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
-ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
-పాల్గొన్న ఎంపీ బండా ప్రకాశ్
అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 18 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మల్లికాంబ మనోవికాస కేంద్రంలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఆరు జిల్లాల ఉత్తమ ఉపాధ్యాయల అవార్డుల కా ర్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 70 శాతానిపైగా ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తున్నారన్నారు. వందశాతం ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి పిల్లల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలు చర్చ జరిపి దానిలోని సానుకూల, ప్రతికూల అంశాలపైన ఒక నివేదికను రూపొందించాలన్నారు. పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా జ్యోతిరెడ్డి ఫౌండేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉత్తమ సర్వీసులు అందిస్తున్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులను సన్మానిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం జ్యోతిరెడ్డి మాట్లాడుతూ కసితో కృషి చేస్తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చని అన్నారు. ఒక మామూలు గృహిణిగా జీవితం ప్రారంభించిన నేను కసి, తపన, శ్రమతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో కీ సాఫ్ట్ సొల్యూషన్‌కు సీఈవోగా ఎదిగా అని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, గీసుకొండ ఎంపీపీ సౌజన్య, కార్పొరేటర్లు మాధవిరెడ్డి, దేవేందర్, పీఆర్‌టీయూఎస్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉమామహేశ్వర్, ఉపేందర్‌రెడ్డి, భూపాలపల్లి జిలా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...