పోచమ్మ ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు


Mon,August 19, 2019 03:38 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: శ్రావణ మాసం పోచమ్మ బోనాల సందర్భంగా నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఏనుమాముల ముసలమ్మ కుంటలోని పోచమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆయన పోచమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల ను చల్లగా చూడాలని, సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించా లని పోచమ్మతల్లిని కోరుకున్నానని అన్నారు. అనంతరం స్థానికు లు కాలనీ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకవచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తూర్పాటి సార య్య, బండ్ల సురేందర్, సంతోష్, కృష్ణమూర్తి, పరమేశ్‌కుమార్, మాధవి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...