స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం పర్యటన


Mon,August 19, 2019 03:38 AM

భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ యోజన పథకంలో భాగంగా కేంద్ర కమిటీ సభ్యులు జీవన్, సునీత, సంపత్‌కుమార్ ఆదివారం భీమదేవరపల్లి, ఎ ల్క తుర్తి మండలాల్లో పర్యటించారు. భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కా ర్యాలయాల ఆవరణలో పచ్చదనం, పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. గ్రా మంలోని ప్రధాన వీధుల్లో పరిశుభ్రత ఏర్పాట్లను గూర్చి గ్రామపంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తడి-పొడిచెత్త సేకరణ తొలగింపు, పారిశుధ్య చర్యలపై గ్రా మస్తులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ, ఎంపీడీవో దేవకీదేవి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు. అ దేవిధంగా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట, దామెర గ్రా మాల్లోని మౌలిక సదు పాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇందుమతి, ఏపీడీ శ్రీవాణి, ఎంపీపీ మే కల స్వప్న, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, సామల జమున, ఎంపీటీసీలు గొర్రె ఆదాం, వేముల రజనీ, చెవుల కొంరయ్య, ఏ పీఎం రవీందర్, ఏపీవో అనిత, వార్డు సభ్యులు, వైద్య సి బ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...