ఆదర్శప్రాయుడు బుద్ధుడు


Mon,August 19, 2019 03:37 AM

-సమసమాజ స్థాపనకు కృషి చేసినగొప్ప మానవతావాది
-ఆయన బోధనలు అనుసరణీయం
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-ఉర్సులో బౌద్ధధర్మంపై అవగాహన సదస్సు
కరీమాబాద్, ఆగస్టు 18: బుద్ధుడి జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు అనుసరణీయమని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్‌లో బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బౌద్ధధర్మంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడు తూ గౌతమ బుద్ధుడు మొదటి ప్రజాస్వామ్యవాదని, సమ సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఏళ్ల తరబడి కాలినడకన తిరిగి ధర్మాన్ని ప్ర చారం చేశారన్నారు. అశోకుడు, డాక్టర్ అంబేద్కర్‌లాంటి వా రు సైతం బౌద్ధం స్వీకరించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ము ఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్‌లో అత్యంత సుందరం గా బుద్ధవనం ఏర్పాటు చేశారన్నారు. బుద్ధవనం ఏర్పాటు ద్వారా బౌద్ధం మరింత ప్రచారం పొందుతుందన్నారు. మం చిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలకు తోడుగా ఉంటానని, బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు అండగా ఉం టానని పేర్కొన్నారు.

బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా జాతీ య కార్యదర్శి బొమ్మల్ల కట్టయ్యను తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించడం సంతోషకరమన్నా రు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు ధర్మ స్థాపనకు పాటుపడ్డారని, అనేక మం దికి మార్గదర్శనం చేశారన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను బుద్ధి స్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సదస్సులో భాగంగా బీఎస్‌ఐ నాయకులు తెలుగులో బౌద్ధం-బౌద్ధ సాహిత్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్య క్రమంలో బౌద్ధ భిక్షువులు ధర్మరక్షిత, బుద్ధఘోషుడు, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ క మిషన్ సభ్యుడు, బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి బొమ్మల్ల కట్టయ్య, బీఎస్‌ఐ రాష్ట్ర నాయకులు సుదర్శన్, శ్రీరామ్మూర్తి, వరుణ్‌కుమార్, ఝాన్సీరాణి, విష్ణువర్ధ్దన్, జిల్లా నాయకులు కృష్ణస్వామి, జగన్‌మోహన్, పాల రవి, ఎల్ల య్య, రవీందర్, సదానందం, రాంచంద్రం, అంబేద్కర్, మ హేందర్, కుమార్, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ఎర్రగట్టు స్వామి, కార్పొరేటర్ జోరిక రమేశ్, బండి రజనీ, నాగపురి సంజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...