సామాజిక చైతన్యం..సంపూర్ణ ఆరోగ్యం..!


Sun,August 18, 2019 03:11 AM

-స్వచ్ఛ గ్రామాలుగా వరంగల్ అర్బన్ జిల్లా..
-ఇంటింటా మరుగుదొడ్డి, వందశాతం వినియోగం
-భూగర్భ జలాల పెంపునకు ప్రతీ పల్లెలో ఇంకుడుగుంతలు..
-మూడు కేంద్ర ప్రభుత్వ అవార్డులు
-రెండేళ్ల శ్రమకు దక్కిన గౌరవం..

సుబేదారి, ఆగస్టు 17: గ్రామాలు స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నాయి. పలెల్లలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల స్వరూపం క్రమంగా మారుతోంది. ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితం స్వచ్ఛ గ్రామాలు గా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో వరంగల్ అర్బన్ జిల్లా ముందు వరుస లో నిలిచింది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛసుందర్ సౌచల్యా, స్వచ్ఛదర్పణ్ పథకాల్లో జిల్లా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

గ్రామస్థాయి కమిటీలు..
జిల్లాలోని 94 గ్రామ పంచాయతీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయనే అంశంపై 2017 ఆగస్టులో డీఆర్‌డీఏ తరుపున సర్వే చేశారు. మొత్తం 42 వేల 240 గృహాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ గృహాలకుగాను 22 వేల 349 మరుగుదొడ్లు కావాలని నిర్ధారించారు. అందుకోసం కలెక్టర్ స్వచ్ఛ భారత్‌మిషన్, ఉపాధి హామీ పథకం కింద 22,349 మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. గ్రామ స్థాయిలో గృహాల సంఖ్యను బట్టి పది నుంచి, 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ప్రభుత్వపరంగా పంచాయతీ కార్యదర్శి, ఆశవర్కర్, ఫీల్డ్‌అసిస్టెంట్, మహిళ సంఘం సభ్యురాలిని నియమించారు. ఈ కమిటీ బాధ్యులు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్ల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. టాయిలెట్లు కట్టుకుంటే రూ.12 వేల నిధులు వస్తాయని అ వగాహన కల్పించి, ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు 45 రోజు ల్లో ప్రతి గ్రామంలో వం దశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారు.

45 రోజుల్లో వం దశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఆమ్రపాలి టార్గెట్‌గా తీసుకొని చివరిరోజు 2017 అక్టోబర్ 15న హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో కలెక్టర్, డీఆర్‌డీవో రాము, గ్రా మస్థాయి సిబ్బంది ఉదయం నుంచి రాత్రి 7 గంటలకు అక్కడే ఉండి గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయించారు. ఈక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లాను అప్పటి కేంద్రప్రభుత్వం గుర్తించి, 2017 నవంబర్ 15న స్వచ్ఛభారత్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డును కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్‌డీవో రాము ఢిల్లీలో స్వచ్ఛభారత్ సెక్రటరీ పరమేశ్వర్ అయ్యర్ చేతులమీదుగా అందుకున్నారు.

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్..
గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు, వాడకం, నీటి వినియోగం, పబ్లిక్ ప్లేస్‌లో టాయిలెట్ల నిర్మాణాలపై 20 18లో స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 680 జిల్లాల్లో ఏజెన్సీ ద్వారా ర్యాండమ్‌గా సర్వే చేయించింది. ఈ సర్వేలో వరంగల్ అర్బన్ జిల్లాకు 9వ ర్యాంకు వచ్చింది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్ 2వ తేదీన కేంద్రమం త్రి ఉమాభారతి చేతులమీదుగా అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి అవా ర్డు స్వీకరించారు.

స్వచ్ఛసుందర్ సౌచల్యా..
దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల వినియోగం, నీటి వాడకం, పరిశుభ్రత, సంపూర్ణ ఆరోగ్యంపై 2019 జనవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వే చేసింది. మొత్తం 680 జిల్లాల్లో ర్యాండమ్‌గా సర్వే నిర్వహించగా, వరంగల్ అర్బన్ జిల్లా 5వ స్థానంలో నిలిచింది. ఇటీవలే డీఆర్‌డీవో రాము ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్నారు. ఈ మూడు అవార్డులతో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు, వాడకం, పరిశుభ్ర త, సంపూర్ణ ఆరోగ్యంపై జిల్లాలకు అరుదైన గౌరవం దక్కింది.

ఇప్పుడు స్వచ్ఛదర్పణ్..
స్వచ్ఛభారత్ మిషన్‌లో మూడో విభాగం స్వచ్ఛదర్పణ్. వం దశాతం మరుగుదొడ్ల వాడకం, పరిశుభ్రత వెరిఫికేషన్, జియోటాగింగ్‌తోపాటుగా లెఫ్ట్‌ఓవర్ టాయిలెట్ల నిర్మాణాలు, భూగర్భ జలాల పెంపుకోసం ప్రతి గ్రామంలో సామూహిక ఇంకుడు గుం తల ఏర్పాటు, ఎరువుల తయారీ కోసం గుంతలు తవ్వుకోవాలని గోడరాతల ద్వారా అవగాహన కల్పించం స్వచ్ఛదర్పన్ ప్రధాన ఉద్ధేశ్యం. కేంద్రప్రభుత్వం 2019 ఆగస్టు 15నాటికి ప్ర తి గ్రామంలో ఇవి చేపట్టాలని గడవు ఇచ్చింది. దీంతో జిల్లా అధికార యంత్రాగం సర్వశక్తులు ఒడ్డి పూర్తిచేశారు. ఈ స్కీంలో దేశంలో 700 జిల్లాలు పోటీపడగా, వరంగల్ అర్బన్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం విశేషం.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...