ఎల్‌ఎల్‌బీ పరీక్షలు ప్రారంభం ముగ్గురు డీబార్


Sun,August 18, 2019 03:09 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 17: కేయూ ఎల్‌ఎల్‌బీ(మూడేళ్లు) మొదటి, నాలుగో సెమిస్టర్, ఎల్‌ఎల్‌బీ(ఐదేళ్లు) ఐదో సెమిస్టర్(సప్లిమెంటరీ), ఎనిమిదో సెమిస్టర్(రెగ్యులర్) పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల తీరుతెన్నులను ఎస్డీఎల్‌సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జీ వీరన్న, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ ఎం సురేఖ, డాక్టర్ వై వెంకయ్య నగరంలోని న్యాయ కళాశాల, దూరవిద్యాకేంద్రంలో పర్యవేక్షించారు. ఉదయం జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 320 మంది విద్యార్థులకుగాను 240 మంది హాజరైనట్లు, 80 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 397 మంది విద్యార్థులకుగాను 372 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం ముగ్గురు విద్యార్థులను డీబార్ చేసినట్లు, నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని వారు తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...