రోగుల కోసం ప్రత్యేక పడకలు


Sun,August 18, 2019 03:09 AM

-ఎంజీఎంకు ఉచితంగా అందజేసిన అచ్యుతారెడ్డి
ఎంజీఎం : ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగులకు అనుకూలంగా ఉండే ప్రత్యేక పడకలను పాలియేటీవ్ కేర్ సెంటర్ డైరెక్టర్ అచ్యుతారెడ్డి శనివారం బహూకరించారు. ఇందుకోసం ఎంజీఎం దవాఖాన ఓపీ వైద్య విభాగం సమీపంలో 10 పడకలతో నెలకొల్పిన సెంటర్‌లో చికిత్స పొందుతున్న చివరి దశలోని క్యాన్సర్ రోగుల సౌకర్యార్థ్ధం ప్రత్యేకించి తెప్పించిన రెండు పడకలను అచ్యుతారెడ్డి ఉచితంగా అందజేశారు. సెంటర్‌లో నూతనంగా నెలకొల్పిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను ఆయన ప్రారంభించారు.

తమ సొంత పనులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండే రోగులు ఉన్నచోటునే అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి ఐసీయూ బెడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్, ఎంజీఎం పర్యవేక్షణాధికారి డాక్టర్ బీ శ్రీనివాసరావు, సెంటర్ ప్రాజెక్టు ఆఫీసర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...