నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌కు


Sun,August 18, 2019 03:08 AM

-రాష్ట్రస్థాయి బహుమతి
రెడ్డికాలనీ : రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో చారిత్రక కట్టడాలు అంశంపై నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ గొట్టె వెంకన్నకు రాష్ట్రస్థాయి బహుమతి(అవార్డు) లభించింది. ఈనెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భం గా టీపీజేఏ తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యాటక, భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫి పోటీల్లో రాష్ట్రస్థాయిలో చారిత్రక కట్టడాలు అంశంపై వెంకన్నకు బహుమతి (అవార్డు) లభించింది. గతంలో కూడా వెంకన్న రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు పొందడం విశేషం. ఈ సందర్భంగా గొట్టె వెంకన్నను నమస్తేతెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, ఎడిషన్ ఇన్‌చార్జి హరీశ్, బ్యూరో చీఫ్ నూర శ్రీనివాస్ అభినందించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...