ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తోంది


Sun,August 18, 2019 03:08 AM

-రాజ్యసభ సభ్యుడు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మత తేడాలు లేకుండా రాష్ట్రంలోని అందరు ఉద్యోగులకు న్యాయం చేస్తోందని, మాజీ సైనికుల సమస్యలను సీఎం కేసీఆర్‌కు చెప్పడంతో వెంటనే స్పందించి వారి సమస్యల కోసం కృషి చేయడం చాలా సంతోషంగా ఉందని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్షీకాంతారావు అన్నారు. మాజీ సైనికులను మనమంతా గౌరవించాలని సూచించారు. సైనికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొనన్నారు. మాజీ సైనికుల కోసం సికింద్రాబాద్ సమీపంలోని గోల్డెన్ పామ్ సైనిక్ భవన్‌లో నాణ్యమైన వైద్య చికిత్స ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. మందుల సమాచారం కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం ఆయనను మాజీ సైనికులు పుష్పగుచ్ఛం అందించి, జ్ఞాపికతో సత్కరించారు. సమావేశంలో తెలంగాణ సైనిక సంక్షేమ సంచాలకులు కల్నల్ రమేశ్‌కుమార్, వరంగల్ సైనిక సంక్షేమ కార్యాలయం అధికారి కెప్టెన్ ఆర్ శ్రీనివాసులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...