మాజీ సైనికులకు అండగా ప్రభుత్వం


Sun,August 18, 2019 03:08 AM


సిద్ధార్థనగర్, ఆగస్టు17: మాజీ సైనికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే మాజీ సైనికులకు న్యాయం జరుగుతోందని ఏపీ, తెలంగాణ ఆఫీసర్ కమాండింగ్ సబ్ ఏరియా జనరల్ మెనేజర్ శ్రీనివాసరావు(జీఓసీ) అన్నారు. శనివారం వడ్డెపల్లిలోని వరంగల్ సైనిక్ సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో వెల్ఫేర్ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, దేశంలోనే మొదటిస్థ్ధానంలో తెలంగాణ ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికులకు అన్ని సరైన సమయంలో వారికి కావాల్సినవి అందుతున్నాయని, ఇండియన్ ఆర్మీ తరుపున ఆరోగ్యం, ఎడ్యుకేషన్, రెసిరెన్షియల్ సదుపాయాలను అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని, దీనికి సీఎం కేసీఆర్ ఎంతో స్పందిస్తున్నారని అన్నారు. మాజీ సైనికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇతర దేశాలు ఆచరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందున ఆయనకు కెప్టెన్ లక్ష్మికాంతారావుతో పాటు మాజీ సైనికులు జ్ఞాపికను అందించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...