ప్రజలకు మరింత చేరువలో సేవలు


Sun,August 18, 2019 03:07 AM

-ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీప్రకాశ్
-బ్రాంచ్ మేనేజర్లతో సమీక్ష సమావేశం
రెడ్డికాలనీ, ఆగస్టు 17: ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఆంధ్రాబ్యాంకు మరిన్ని సేవలను ప్రారంభించినట్లు జోనల్ మేనేజర్ కే శ్రీప్రకాశ్ అన్నారు. శనివారం హన్మకొండలోని ఓ హోటల్‌లో బ్రాంచ్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీప్రకాశ్ మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు బ్యాంకింగ్ అవసరాలను ప్రజల జీవన అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలతో, ఆధునిక మార్పులతో ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకు అనుగుణంగా కొత్త ఆలోచనలు అమలు చేయడం ద్వారా ప్రతీశాఖ మెరుగుపరిచేవిధంగా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...