16 మండలాల్లో 16లక్షల మొక్కలు


Sat,August 17, 2019 03:35 AM

-ఒకేరోజు 16 మండలాల్లో 16లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
-ఉదయం 8గంటలకే ప్రారంభం
- గ్రామాలకు చేరుకున్న మొక్కలు
-సంగెం మండలంలో ప్రారంభించనున్న్ల కలెక్టర్ హరిత
-శాయంపేటలో జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
-మొక్కలు నాటకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో వరంగల్ రూ రల్ జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని అధిగమించడంతోపాటు ఈ ఏడాది లక్ష్యాలను మించి మొ క్కలు నాటాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా హరితశోభను సంతరించుకునేలా హరితహారం లక్ష్యాలను సంపూర్ణంగా, సమర్ధవంతంగా అధిగమించేలా కార్యాచరణను అధికారు లు సిద్ధం చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత ప్రత్యేకంగా మెగా హరితహారం పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ దిశలో పక్షం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ప్రతీ అధికారిని క్షేత్రస్థాయి నుంచి భా గస్వాములను చేయడంతోపాటు బాధ్యులను కూడా చేశా రు. ఊరూరా నర్సరీ మొక్కలు చేతికి అందాయి. నాటేందుకు వీలుగా సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైనా సమృద్ధిగా కురియడంతో కలెక్టర్ ఈ మెగా హరితహారానికి శ్రీకారం చుట్టారు. నేడు (శనివారం) మెగా హరితహారం నిర్వహించేందుకు పలుమార్లు అధికారులతో సమీక్షలు జ రిపి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా వా రీగా ఎక్కడికక్కడ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వా రికి బాధ్యతలు అప్పగించారు. పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను అందుబాటులో ఉంచారు. గ్రామాలు, మండలాలవారీగా ప్రణాళికలను పరిశీలించి మొక్కలను కేటాయించారు.

ఈ మేరకు జిల్లాలో ప్రతీ మండలానికి లక్ష మొక్కల చొప్పున 16 మండలాలకు 16 లక్షల మొక్కలను నాటేలా క్షేత్రస్థాయిలో కూడా అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను పూర్తి చేయించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో స్పెషల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. శనివారం జరిగే మెగా హరితహారం జిల్లావ్యాప్తంగా ఉన్న 16 మండలాల్లోని 401 గ్రామపంచాయతీల్లో, శివారు పల్లెల్లో సరిగ్గా 8 గంటలకు గ్రామ, మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ మెగా హరితహారాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మెగా హరితహారంతో ఇప్పటికే రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్న రూరల్ జి ల్లాలో ఈ లక్ష్యాన్ని నెరవేరిస్తే కోటి మొక్కలు నాటే లక్ష్యం దాటనున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ హరితహారంలో ప్రతీ ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యం చేసినా, నర్సరీలో నుంచి తీసుకెళ్లిన మొ క్కను నాటకుండా వదిలేస్తే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.

జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని వార్డులకు, మండల కేంద్రాలకు మొక్కలు చేరుకున్నాయి. జిల్లాలోని సంగెం మండలంలో కలెక్టర్ హరిత, శాయంపేట మండలంలో జెడ్పీ చై ర్ పర్సన్ గండ్ర జ్యోతి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలో పాల్గొననున్నారు. అటవీ శాఖ నుంచి డీఎఫ్‌వో పురుషోత్తం, డీఆర్డీఏ నుంచి సంపత్‌రావు, జిల్లా పరిషత్ సీఈవో రాజారావు, స్పెషల్ ఆఫీసర్లు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు ఈ మెగా హరితహారంలో పాల్గొని జిల్లాలో ఒకేరోజు ఒకే సమయానికి 16 మండలాల్లో 16 లక్షల మొక్కలు నాటనున్నారు.

స్పెషల్ ఆఫీసర్లతో రివ్యూ..
ప్రణాళికలు, ఏర్పాట్లు, మెగా హరితహారం విజయవంతంపై స్పెషల్ ఆఫీసర్లతో ప్రత్యేక రివ్యూను కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సంతోష్, డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, డీఎఫ్‌వో పురుషోత్తం, జెడ్పీ సీ ఈవో రాజారావు, మండల స్పెషల్ అధికారులు, జిల్లా అ ధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...