నాటు యంత్రాలతో కూలీల కొరత అధిగమించవచ్చు


Sat,August 17, 2019 03:31 AM

ఖానాపురం, ఆగస్టు 16 : వ్యవసాయ రంగం లో వస్తున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణ పద్ధ్దతుల వైపు రైతులు దృష్టి సా రించాలని నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఐనపల్లి శివారులో రైతు గుగులోతు రామస్వామినాయక్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో యంత్రంతో నాటు వేసే విధానంపై డివిజన్‌లోని వివిధ మండలాల రైతులకు ప్రదర్శన చూపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీఏ మా ట్లాడుతూ రోజు రోజుకూ వ్యవసాయరంగంలో కూలీల కొర త అధికమవుతున్నదన్నారు. యంత్రంతో నాటు వేసు కునే విధానం రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రైతు లు యాంత్రీకరణ వైపు వెళ్లేందుకు ప్రభుత్వం అనేక రాయితీలను అందజేస్తున్నదన్నారు.అందులో భాగంగా వరికో త యంత్రాలకు 50 శాతం రాయితి అందజేస్తున్నదని అన్నారు. చిన్ననాటుయంత్రాలకు రూ.3.40 లక్షలు, పె ద్ద నాటు యంత్రాలకు రూ.14 లక్షలు కాగా, వాటిలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై రైతులకు విక్రయిస్తుందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, గుగులోత్ రా మస్వామి, ఏవో శ్రీనివాస్, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమా ర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుంచార పు వెంకట్‌రెడ్డి, బొప్పిడి పూర్ణచందర్, కత్తాల వెంకటేశ్వ ర్లు, గంగాధర రమేశ్, మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, వ ల్లెపు శ్రీనివాస్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...