పల్లెల అభివృద్ధే లక్ష్యం


Sat,August 17, 2019 03:30 AM

శాయంపేట, ఆగస్టు 16 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట మం డలం కొత్తగట్టుసింగారంలో ఉపాధి హామీ పథకం నిధు లు రూ.13 లక్షలతో నూతనంగా చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్రజ్యోతితో కలిసి ఎమ్మెల్యే రమణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించి, హరితహారంలో భాగంగా గండ్ర దంపతులు మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కొత్తగట్టుసింగారంలో 2009-10లోనే గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో నిర్మించడం వీలుకాలేదని పేర్కొన్నారు.

నాలుగైదు నెలల్లోనే పనులను పూర్తి చేసి అన్ని వసతులతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు తక్కువ పడితే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి లేదా కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భారీగా మొక్కలను పెంచి సంరక్షించుకునేందుకు హరితహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. సంపదను సృష్టించడం చాలా కష్టమని, విధ్వంసం చేయడం చాలా సులువని పేర్కొన్నారు. చెట్లను సులువుగా కూల్చి వేస్తున్నారని, ఒక చెట్టు పెరిగేందుకు ఎంత కష్టమవుతుందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఇంటిలోను నాలుగు మొక్కలను తప్పకుండా నాటుకోవాలని కోరారు. శనివారం మండలంలో లక్ష మొక్కలు నాటి, మెగా ప్లాంటేషన్‌ను చేపడుతున్నామని తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...