ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి


Sat,August 17, 2019 03:29 AM

దామెర, ఆగస్టు16 : ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పీ శంకర్ అన్నారు. శుక్రవారం దామెర మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్(డీబీఆర్‌సీ) ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ యువతకు వివిధ శిక్షణ సంస్థల ద్వారా నైపుణ్యంతో ఉండే కోర్సులైన కంప్యూటర్, బ్యూటీషియన్, వెల్డింగ్, డయాలసిస్, టెక్నీషియన్స్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఓటూ స్కిల్ కో-ఆర్డినేటర్ బీ రవీందర్ మాట్లాడుతూ.. ఓటూ స్కిల్ శిక్షణ కేంద్రంలో కమ్యూనికేషన్ స్కిల్స్, హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్ మాట్లాడుతూ దళిత యువత ఇటువంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని అన్నారు. ఈ సందర్భంగా 40 మంది యువత వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సదస్సులో డీబీఆర్‌సీ జిల్లా సమన్వయకర్త చుంచు రాజేందర్, సంపూర్ణ, మేకల అనిల్, మాదాసి సురేశ్, కార్తిక్, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...