విలువలతో కూడిన విద్యతోనే గుర్తింపు


Sat,August 17, 2019 03:29 AM

దుగ్గొండి, ఆగస్టు 16 : విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ తిప్పారపు గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం లక్ష్మీపురం గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. జేఎస్‌ఆర్ సన్ సిటీ డైరెక్టర్, గ్రామ ఉపసర్పంచ్ పాండవుల సురేందర్ పాఠశాల విద్యార్థి ముద్దం అంజలికి రూ.5వేల నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సురేందర్ అభినందనీయుడని కొనియాడారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థికి రూ.25 వేల నగదు బహుమతి, పాఠశాల టాపర్‌కు రూ. ఐదు వేలు ఇస్తానని సురేందర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మామునూరు సుమన్, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ రవికుమార్‌గౌడ్, హెచ్‌ఎంరమేశ్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...