కన్నుల పండువగా నిత్య పంచహారతి కార్యక్రమం


Fri,August 16, 2019 04:39 AM

ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నిత్య పంచహారతుల కార్యక్రమం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. శైవ సాంప్రదాయం లో భాగంగా పంచహారతుల కా ర్యక్రమం ప్రారంభంతో స్వామి వారికి రోజు ప్రదోషకాలం సమయంలో ఈ పంచహారతి కార్యక్రమం కొనసాగనుంది. ఈవో నాగేశ్వర్‌రావు, అర్చక బృందం మా ట్లాడుతూ.. ఏక, ద్వయ, త్రయా, పంచ, నక్షత్ర, కుంభ హారతులు స్వామి వారికి ఇస్తున్నట్లు చెప్పా రు. గతంలో ఏక హారతి మాత్రమే స్వామి వారికి ఇచ్చే వారు, కావున మిగిలిన పంచహారతులను శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ పంచహారతిని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నే ని మధుమతి, ఉమ్మడి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మా ర్నేని రవీందర్‌రావు, ఆలయ డైరెక్టర్ భూ పాల్‌రెడ్డి, ఆలయా అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...