విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో..


Fri,August 16, 2019 04:36 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హన్మకొండ మచిలీబజార్‌లోని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో జిల్లా సంఘం అధ్యక్షుడు చొల్లేటి కృష్ణమాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు పెందోట చక్రపాణి జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సలహాదారులు, నాయకులు వెలకంటి రాంమూర్తి, వీణవంక సదానందం, కట్టా ఈశ్వరప్రసాద్, దుంపేటి రాజు, బొల్లోజు చంద్రసేన, రామన్న, వీరన్న, సత్యం, నీలోజు శ్రీనివాస్, పబ్బోజు, కత్రోజు లింగాచారి, అలుగోజు కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ, కృష్ణ, మహారాజ భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు.

గోల్డెన్‌ఓక్ స్కూల్‌లో..
కాపువాడలోని గోల్డెన్ ఓక్ స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కలువల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ, వైస్ ప్రిన్సిపాల్ దీప్తి పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో కార్యాలయంలో..
వరంగల్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు.

జోయాలుక్కాస్‌లో..
హన్మకొండ చౌరస్తాలోని బంగారు ఆభరణాల షోరూం జోయాలుక్కాస్‌లో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నింటో, సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...