కేయూలో రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా


Fri,August 16, 2019 04:36 AM

రెడ్డికాలనీ: స్వాతంత్య్ర ఫలాలు దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలందరికీ అందాలని కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వీరన్న అన్నారు. గురువారం కేయూ దూరవిద్య కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం డైరెక్టర్ వీరన్న మాట్లాడుతూ దేశంలో అనేక చిన్న రాష్ర్టాలు సంస్థానాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకీకృతం చేశారని అదే క్రమంలో జమ్ముకాశ్మీర్ ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బల్బీర్‌సింగ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, డాక్టర్ కొట్టే భాస్కర్, డాక్టర్ భిక్షపతి, డాక్టర్ గురుబ్రహ్మం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సరళాదేవి, టైం స్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సల్లా యాదగిరి, బూర సత్యప్రకాశ్, ఎస్సీ, ఎస్టీ దూరవిద్య ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కొట్టే భాస్కర్, ప్రతాప్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంగాల ఎఫ్రామ్‌రాజ్, దినసరి ఉద్యోగుల సంఘం కార్యదర్శి రవి, వెంకటేశ్వర్లు, వల్లాల తిరుపతి, రమేశ్, సంగీత, ఆండాలు పాల్గొన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో..
కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిజిస్ట్రార్ పురుషోత్తం జాతీయ జెండావిష్కరించారు. ఇంజినీరింగ్ ఎన్‌సీసీ కేడెట్లచే గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతం త్య్రం అని, వారిని మరవకూడదన్నారు. ఈ సందర్భంగా కేయూ న్యూస్ లెటర్‌ను చీఫ్ ఎడిటర్ ఆచార్య శ్రీనివాస్, ఎడిటర్లు ఆచార్య శ్రీనివాసరావు, వల్లాల పృథ్వీరాజ్ ఆవిష్కరించారు. మూడురోజులుగా కేయూ ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సి బ్బంది, పరిశోధ విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

అభివృద్ధి అధికారి కార్యాలయంలో..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశ్వవిద్యాలయ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అభివృద్ధి అధికారి ఆచార్య రాంచంద్రం జెం డాఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్ శ్రీనివాస్‌రావు, భూ పాల్‌రెడ్డి, రవిశంకర్, శివశంకర్, జితేందర్, శంకర్‌రావు, సలీం, జీవ న్, రవి, ముఖేష్, పాషా, రమేశ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

కేయూలోని వివిధ కార్యాలయాల్లో..
కేయూ ఎన్జీవోస్ కార్యాలయంలో జాతీయ జెండా ప్రధాన కార్యదర్శి తిరుపతి ఎగురవేశారు. యూనివర్సిటీ కాలేజీ, వ్యాయామ కళాశాల, విద్యా కళాశాలలో ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, కామర్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ సక్రియ, ఫార్మసీ కాలేజీలో ఆచార్య కిషన్, స్పోర్ట్స్ బోర్డులో ఆచార్య సురేశ్‌లాల్, మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో డాక్టర్ మంజుల, కేయూ ఇంజినీరింగ్ కాలేజీ(కోఎడ్యుకేషన్)లో ఆచార్య శ్రీనివాసులు జాతీయ జెండా ఎగురవేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...