మనకు..e -బస్సులు..!


Thu,August 15, 2019 03:07 AM

(వరంగల్ ప్రధాన ప్రతినిధి- నమస్తే తెలంగాణ) మారుతున్న కాలానుగుణంగా ప్రజా రవాణా రంగంలో రాష్ట్ర రావాణా రోడ్డు సంస్థ కొత్త పుంతలు తొక్కుతున్నది. రాష్ట్రంలో అతిపెద్ద రెండో నగరంగా విరాజిల్లుతున్న వరంగల్ మహానగరానికి అధునాతమైన ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు రాబోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న వాహన కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటుంది, తద్వారా మానవ మనుగడకు తీవ్రమైన అటంకాలు తలెత్తుతున్నాయి. మహానగరాల్లో వాహన కాలుష్యంతో నగర ప్రజలు కాలుష్యకోరల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రధానంగా శ్వాసకోస అవయవాలు దెబ్బతిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నానేది వైద్య నిపుణులు, సర్వేలు చెబుతన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పర్యావవరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ దేశంలో మెట్రోపాలిటన్ సిటీల్లో వెహికిల్ పొల్యూ షన్ కంట్రోల్ చేయడానికి ప్రజా రవాణాలో పొగలేకుండా నడిచే అత్యానిధుక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లను కేవలం నగరాల్లో మాత్రమే నడపడానికి కేంద్రప్రభుత్వం ఫేమ్ ఇండియా స్కీమ్‌లో భాగంగా ఎలా్రక్ట్రానిక్ బస్సుల (e-బస్సు) పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఏడాది క్రితం ఈ బస్సులను మొదటవిడతగా దేశ రాజదాని ఢిల్లీ, కలకత్తా, చెన్నై, రాష్ట్ర రాజదాని హైదారాబాద్, బెంగుళూర్ వంటి మహా నగరాల్లో కొన్ని బస్సులను మంజూరు చేసింది. దీంతో ఈ బస్సుల వలన ఆయా నగరాల్లో ఆర్టీసీ పరంగా వాహన కాలుష్యం అనేది తగ్గడమే కాకుండా ఆర్టీసీకి ఇంధన ఖర్చు కూడా ఆదా అయి, సంస్థకు లాభాలు రావడానికి దోహదపడుతున్నాయి. ఈ ఫలితాలతో కేంద్ర ప్రభుత్వం రెండో విడతగా దేశంలో మిల్లియన్ ప్లస్,క్యాపిటల్ సిటీలు, స్మార్ట్‌సిటీలుగా ఉన్న 64 నగరాలకు ఈ బస్సులను మంజూరు చేస్తూ బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వరంగల్ మహానగరం ఇప్పటికే స్మార్ట్ సిటీ కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అమలు అవుతున్న నేపథ్యంలో ఈ-బస్సులు రాబోతున్నాయి. ఈ మేరకు నగరానికి 25 ఈ-బస్సులు మంజూరు చేసింది. పీపీపీ మోడ్‌లో ఈ-బస్సులు నడపబోతున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

వరంగల్ రీజియన్‌కు 25 ఈ-బస్సులు
కేంద్ర ప్రభుత్వం ఫేమ్ స్కీం క్రింద దేశవ్యాప్తంగా 64 సిటీలకు మొత్తం 5595 సర్వీస్‌లను మంజూరు చేసింది. ఇందులో తెలంగాణ రాష్ర్టానికి సంబందించి రెండు సిటీలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ అయితే, రెండోది అభివృద్ధి చెందుతున్న వరంగల్ సిటీ. హైదారాబాద్‌కు 300, వరంగల్ సిటీకి 25 బస్సు లు మంజూరైనవి. ఈ బస్సులతో వరంగల్ సిటీకి కొత్త కళ రానున్నది. రాష్ట్రంలోనే వరంగల్ నగరం రవాణా రంగంలో సరికొత్త పంథాలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిటీలో నర్మ్‌బస్సులు నడుస్తున్నాయి. ఈ కొత్త రకమైన ఈ-బస్సులతో నగరానికి కొత్త లుక్ రానున్నది.

వరంగల్ రీజియన్ రాష్ట్రంలోనే ఆదాయంలోనూ, ప్రయాణసౌకర్యంలో మొదటిస్థానంలో ఉంది. రీజియన్‌లో తొమ్మిది డిపోలు వరంగల్ 1,2 ,హన్మకొండ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, జనగాం, మహబుబాబాద్, తొర్రూర్ డిపోలనుంచి ప్రతిరోజు 753 బస్సులు రాష్ట్ర, అంతరాష్ర్టాలకు 3 లక్షల,76వేల కిలోమీటర్లు నడుస్తుంటాయి. పది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రోజువారి ఆదాయం కోటి, 25 లక్షలు వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హన్మకొండ బస్‌స్టేషన్ అతిపెద్దది. ఇక్కడి నుంచి దూరప్రాంతాలు బెంగుళూరు, తిరుపతి, అమరావతి, కడప, వైజాగ్, పూనే, షిరిడి తదితర ప్రాంతాలకు బస్సులు వెళ్తుంటాయి. హన్మకొండ బస్‌స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో ఈ-బస్ స్టేషన్‌గా రూపుదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఇక్కడి బస్‌స్టేషన్ డీపీఆర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. అందులో భాగంగానే ఈ-బస్సు నగర ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నది.

ఈ-బస్సు ప్రత్యేకత..
ఈ-బస్సుతో కాలుష్యం అనేది ఉండదు. ఇదే దీని ప్రత్యేకత. అంతేకాదు నిర్వహణ వ్యయం కూడా ప్రస్తుతం నడుస్తున్న బస్సులతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమనేది ప్రత్యేకత. పూర్తిగా ఎలాక్ట్రానిక్ బ్యాటరీ సిస్టంతో నడుస్తుంది. బస్సు నడుస్తుంటే శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. పూర్తిస్థాయిలో కాలుష్య నియంత్రణ ఉం టుంది. అంతేకాకుండా ఇంధన వాడకం అనేది ఉండదు. దీనివలన ఇంధనంపై పెట్టె ఖర్చు కూడా తగ్గుతుంది. మొత్తానికి త్వరలో నగర రోడ్లపై ఈ-బస్సు స్మూత్‌గా తిరిగే రోజులు సమీప భవిష్యత్‌లో రానున్నాయి.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...