ఈటల నిషాంత్‌కు నివాళులు


Thu,August 15, 2019 03:07 AM

కమలాపూర్: మండల కేంద్రంలోని కమలాపూర్ కమ్యూనిటీ హాల్‌లో ఈటల నిషాంత్ 12వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం చేపట్టి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈటల నిషాంత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు, కమలాపూర్ ఎడ్యూకేషనల్ చారిటబుల్ ట్రస్టు, తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ఎంజేపీ, మోడల్ స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కమలాపూర్ ఎడ్యూకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఈటల సమ్మయ్య కుమారుడు నిషాంత్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, అంతర్జాతీయ జర్నలిస్టు కమలాపూర్ ఎడ్యూకేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిమల్ల వెంకటనారాయణ, నంది అవార్డు గ్రహీత బ్లిమ్, ఎంపీపీ రాణి, జెడ్పీటీసీ కళ్యాణి, సర్పంచ్ విజయరెడ్డి, కమలాపూర్ ఎడ్యూకేషనల్ చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్లు డాక్టర్ దాసి సాంబయ్య, డాక్టర్ మల్లికార్జున్, వరంగల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈటల భద్రయ్య, డాక్టర్లు, నాయకులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

మా తల్లి బతికి ఉంటే బాగుండేది
మా ఈటల మల్లయ్యకు నూరేళ్లు నిండాయి మా తల్లి బతికి ఉంటే బాగుండేదని కమలాపూర్ ఎడ్యూకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, పుస్తక రచయిత డాక్టర్ ఈటల సమ్మయ్య భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం కమ్యూనిటీ హాల్‌లో తన కొడుకు నిషాంత్ 12వ వర్ధంతి, నాన్న నీకు నూరేళ్లు అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సమ్మయ్య అన్న మాటలివి. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయిన కొడుకులు గొప్పగా బతుకుతుంటే తన తండ్రి ఈటల మల్లయ్య చూశాడు కానీ తల్లి ఉంటే ఎంతో బాగుండేదని కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులుగా ఎంత గొప్పగా బతికిన తల్లిలేని లోటు తీర్చలేనిదన్నారు. తన కొడుకు నిషాంత్ వర్ధంతికి వచ్చిన నంది అవార్డు గ్రహీత బ్లిమ్, తన సోదరుడు ఈటల రాజేందర్, అంతర్జాతీయ జర్నలిస్టు వెంకటనారాయణ, వైద్యులు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...