వృద్ధులే స్ఫూర్తి ప్రదాతలు


Thu,August 15, 2019 03:07 AM

కమలాపూర్: సమాజానికి స్ఫూర్తినిచ్చేది, మా ర్గ దర్శకంగా నిలిచేది వృద్ధులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కమలాపూర్ మండలకేంద్రంలో ఈటల నిషాంత్ 12వ వర్ధంతి, నాన్న నీకు నూరేళ్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యా రు. మంత్రి తండ్రి ఈటల మల్లయ్యకు నూరేళ్లు నిండటంతో మంత్రి అన్న ఈటల సమ్మయ్య నా న్న నీకు నూరేళ్లు అనే పుస్తకాన్ని రాశారు. పుస్తకా న్ని మంత్రి ఈటల రాజేందర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. పుస్తకాన్ని మంత్రి ఈటల రాజేంద ర్, అన్న ఈటల సమ్మయ్య, తమ్ముడు ఈటల భ ద్రయ్య తండ్రి ఈటల మల్లయ్యకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి సమాజంలో ముసలివాళ్లంటే పనికిరాని వాళ్లుగా భావిస్తున్నారన్నారు. ముసలివాళ్లు తమ అనుభవాల తో సమాజానికి స్ఫూర్తినిస్తూ మంచిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు కలిసి గొ ప్పగా ప్రేమానురాగాలతో బతికేదని గుర్తుచేశారు. నేటి సమాజంలో ఆస్తులకోసం రక్త సంబంధీకులై న అన్నతమ్ముళ్లు, అక్కాచెల్లెలు అని చూడకుండా చంపుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వృ ద్ధ్దాప్యం రాగానే తల్లిదండ్రులను వృద్ధ్దాశ్రమంలో చేర్చుతున్నారని, దీంతో మానవ సంబంధాలు తె గిపోతున్నాయన్నారు. వృద్ధులని వారసత్వ సంపదగా భావించాలని సూచించారు. మంత్రి ఈటల నిషాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఈటల నిషాంత్ మెమోరియల్ చారిట్రబుల్ ట్రస్టు, కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యం లో ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను మం త్రి అందజేశారు. కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామనంద తీర్థ ట్రస్టు నిర్వహిస్తున్న ఉచిత కుట్టుమిషన్ సర్టిఫికెట్లను మహిళలకు పం పిణీ చేశారు. కార్యక్ర మంలో కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ వెంకటనారాయణ, నంది అవార్డు గ్రహీత బ్లిమ్, ఎంపీపీ తడక రాణి, జెడ్పీటీసీ లాండిగ కల్యాణి, సర్పంచ్ కట్కూరి విజయారెడ్డి, ట్రస్టు డైరెక్టర్లు డాక్టర్ దాసి సాంబయ్య, డాక్టర్ మల్లిఖార్జున్, మల్లిఖార్జున్‌దే వ్, ప్రొఫెసర్ రావు, క్రి ష్ణకుమారి, వైద్యులు, నా యకులు తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...