యమ డేంజర్..!


Thu,August 15, 2019 03:07 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: మహా నగరపాల క సంస్థ పరిధిలో వందేళ్ల క్రితం నాటి పాత భవనాల సంఖ్య తేల్చారు. అతి ప్రమాదకరంగా ఉన్న భవనాలను వెంటనే కూల్చివేయాలన్న లక్ష్యంతో బల్దియా అధికారులు గ్రేటర్‌లో శిధిలావస్థకు చేరి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలను క్షేత్రస్థాయిలో సర్వే చేసి లెక్క తీశారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని డివిజన్లలో శిథిలావస్థలో ఉ న్న భవనాలను గుర్తించి వాటి ఫొటోలతో సహా అ ధికారులకు అందచేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారు లు గత కొన్ని రోజుల కింద క్షేత్రస్థాయిలో సర్వే చే సి గుర్తించిన పాత భవనాల స్టక్చర్ స్టెబిలిటీని ని ర్దారించేందుకు ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. దీంతో నగరంలో వందల సంఖ్యలో పా త భవనాలను ఉన్నట్లు బల్దియా అధికారులు చె ప్పుతున్నారు. వరుసగా వర్షాలు కురిస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో పాత భవనాలు కూలిపోయి మృత్యువా తపడిన అనుభవాల దృష్ట్యా బల్దియా అధికారులు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు గ్రేటర్ పరిధిలో డివిజన్ల వారిగా చేసిన సర్వేలో 879 శిధిలావస్థలో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో వందేళ్ల భవనాలు కనీసం 500 వరకు ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు. దశా బ్దాల కాలంగా ఈ భవనాలు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. నగర ప్రధాన కూడళ్లు, రహదారు లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అనేక పాత భవనాలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. దీని లో భాగంగానే రెండు రోజుల క్రితం వరంగల్ చౌ రస్తా ప్రాంతంలోని వందేళ్లపైగా ఉన్న పాత భవనాన్ని బల్దియా అధికారులు కూల్చివేశారు. పాత భవనాలు కూలి ప్రాణనష్టం జరుగకుండా ఉండేందుకు ముందుస్తు చర్యలో భాగంగా చేపట్టిన కూ ల్చివేతల పరంపర ఆరంభశూరత్వం కాకుండా డేంజర్ స్థితిలో ఉన్న శిధిలావస్థకు చేరిన భవనాల కూల్చివేతలను కొనసాగించాలని జనం కోరుకుంటున్నారు.

879 పాత భవనాలు
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 879 పా త భవనాలు శిధిలావస్థలో ఉన్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఇంజినీరింగ్ అధికారులు వాటి స్టక్చర్ స్టెబిలిటీని నిర్ధారించి వాటిని కూల్చివేయాలని సూచించారు. నగర ప్రధాన రహదారులు, నిత్యం జనం రద్దీతో ఉండే ప్రాంతాలలో ఈ పాత భవనాలు ఉండటం భయాందోళనలకు గురిచేస్తోంది. గత వర్షాకాలం సమయంలో కాశీబుగ్గ, ఖమ్మం రోడ్‌లో పాత ఇళ్లు కూలి ఇద్దరు మ రణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బల్ది యా అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. బల్దియా అధికారులు చేసిన సర్వేలో లెక్క తేల్చిన శిధిలావస్థలో ఉన్న పాత భవనాలలో సుమారు 500 వరకు వందేళ్ల కింద నిర్మించినవి గా గుర్తించారు. మరికొన్ని 50 సంవత్సరాల క్రి తం నిర్మించినవి ఉన్నాయి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేందుకు శిధిలావస్థకు చేరిన భవనాలు కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ముందస్తుగా ప్రధాన ర హదారులు, కూడళ్ల వద్ద ఉన్న పాత భవనాలపై అధికారులు దృష్టి సారించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...