సీఎం పర్యటనకు హెలికాప్టర్ ట్రయల్ విజయవంతం


Wed,August 14, 2019 02:06 AM

పరకాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం పర్యటనకు సంబంధించిన హెలీప్యాడ్ ఏర్పా ట్లు పూర్తయ్యాయి. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం పెద్దకర్మ జరగనుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించడంతోపాటు మల్లారెడ్డికి నివాళులర్పిం చానున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి ఆకాశమార్గాన హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి నేరుగా సీఎం ప్రగతిసింగారం చేరుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఉద యం వరకే హెలీప్యాడ్ ఏర్పాట్లు పూర్తికాగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ హరిత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం మూడు గంటల తరువాత సీఎం వచ్చే హెలికాప్టర్ ట్రయల్ కోసం హెలిప్యాడ్ ప్రదేశానికి చేరుకుంది. హన్మకొండ వైపు నుంచి నేరుగా ప్రగతిసింగారంలో ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని గుట్టల చుట్టూ తిరిగి వచ్చి హెలిప్యాడ్ స్థలానికి వచ్చి సుమారు 5మీటర్ల ఎత్తులోనే నిలిపింది. అందులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హెలీప్యాడ్ పరిశీలించి తిరిగి వెళ్లిపోయారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు డ్యూటీలను జిల్లా కలెక్టర్ హరిత విభజించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ మహేందర్‌రెడ్డికి హెలీప్యాడ్ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించగా ఆయన పరకాల ఆర్డీవో ఎల్ కిషన్‌తో కలిసి హెలీప్యాడ్‌ను పరిశీలించారు.

భారీ బందోబస్తు
శాయంపేట : మండలంలోని ప్రగతిసింగారానికి బు ధవారం సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. ప్రగతిసింగారం శివారులో ఖాళీ స్థలంలో హెలీప్యాడ్‌ను ఏ ర్పాటు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో హెలీప్యా డ్ పనులు చేపట్టారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. హెలిప్యాడ్ చుట్టు కంచె ఏర్పాటు చేయ గా డీసీపీ నాగరాజు బందోబస్తును పర్యవేక్షించారు. గ్రా మంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నివాసం తో పాటు చుట్టు ప్రాంతాల్లో డాగ్‌స్వాడ్, మెటల్ డిటెక్టర్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

523 మందితో భారీ బందోబస్తు ..
సీఎం పర్యటన నేపథ్యంలో ప్రగతిసింగారంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్, డీసీపీ పర్యవేక్షణలో ఆరుగురు ఏసీపీలు, 16 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు, 150 ఏఎస్‌ఐ, 300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సీఎం వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు ఉన్నతాధికారులు పర్యటించి బం దోబస్తు చర్యలు చేపట్టారు.

హరీశ్‌రావుతో సెల్ఫీలకు ఎగబడిన యూత్
శాయంపేట : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతో సెల్ఫీ దిగేందుకు యువకులు ఎగబడ్డారు. మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించేందుకు మంగళవారం ఆయన నివాసానికి హరీశ్‌రావు చేరుకున్నారు. హరీశ్‌రావు ధర్మారెడ్డితో మాట్లాడి వెళ్లిపోయేందుకు బయటకు రాగానే అక్కడ ఉన్న యువకులు అంతా ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. అయితే హరీశ్‌రావు ఓపికగా ప్రతి ఒక్కరితో సెల్ఫీ ఫొటో దిగారు. డైనమిక్ లీడర్ అంటే ఇలా ఉండాలి అంటూ యువకులు ఖుషీఅయిపోయారు.

రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు
శాయంపేట : మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి వెళ్లే రోడ్లకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. నేరేడుపల్లి నుంచి ప్రగతిసింగారం, పత్తిపాక నుంచి ప్రగతిసింగారానికి వెళ్లే రోడ్లను మరమ్మతులు చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. రోడ్లపై దుమ్ము రాకుం డా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చివేసి రోడ్లన బాగు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...