ఎమ్మెల్యే చల్లాకు పరామర్శల వెల్లువ


Wed,August 14, 2019 02:03 AM

శాయంపేట, ఆగస్టు 13 : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తండ్రి చల్లా మ ల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసానికి చేరుకుని ఆయను పరామర్శిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిశారు. నేడు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా విషయాలను చర్చించారు. సీఎం వచ్చే ప్రాంతాన్ని మంత్రిఎర్రబెల్లి కలియతిరిగారు. భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వర్షం పడే అవకాశం ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్మే ధర్మారెడ్డిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. చల్లా మల్లారెడ్డి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. కొద్దిసేపు ఎమ్మెల్యేతో హరీశ్‌రావు మాట్లాడారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్‌రావు, మార్నెనీ రవీందర్‌రావు, నమస్తే తెలంగాణ ఉమ్మడి జిల్లా బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్ ఎమ్మెల్యేను పరామర్శించి మల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేను కలిసి పరామర్శించారు. టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఎమ్మెల్యేను పరామర్శించి ఆయన తండ్రి మల్లారెడ్డికి నివాలర్పించారు. సీఎండీ డీఈ టెక్నికల్ అనిల్‌కుమార్, రూరల్ డీఈ మల్లిఖార్జున్, ఎమ్మార్టీ డీఈ వెంకటస్వామి, ఏఈ రాజమౌళి పరామర్శించారు. జేసీ మహేందర్‌రెడ్డి, ఆర్డీవో కిషన్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పరామర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులు మంద ఐలయ్య, గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, రూరల్ జిల్లా వైద్యాధికారి మధుసూదన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బొల్లం సంపత్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ముస్కె రాము, జనగామ జిల్లా టీఆర్‌ఎస్‌వీ కోఆర్డీనేటర్ మేడారపు సుధాకర్, జిల్లా కోఆర్డీనేటర్ పోచంపల్లి రఘుపతి, జాగృతి నాయకులు యార బాలకృష్ణ, జన్ను రాజు, కత్తెపల్లి దామోదర్, ఎన్‌ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ నైని సంపత్‌రావు, ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, ఓగ్లాపూర్ డిస్నిల్యాండ్ స్కూల్ కరస్పాండెంట్ శోభారాణి, మల్లయ్య, సదానందం, డైరక్టర్లు భానుచందర్, రాకేశ్, లక్ష్మీనివాస్, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, కర్ర ఆదిరెడ్డి, తాళ్లపల్లి దామోదర్‌గౌడ్ ఎమ్మెల్యేను ధర్మారెడ్డిని పరామర్శించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...