బోనమెత్తిన ఎర్రబెల్లి దంపతులు


Wed,August 14, 2019 02:02 AM

కొడకండ్ల, ఆగస్టు 13 : మండల కేంద్రంలోని కాల భైరేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉషాదయాకర్‌రావు దంపతులు బోనం ఎత్తుకుని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అతి పురాతన చరిత్ర కలిగిన కాళబైరేశ్వర స్వామి ఉత్సవాలను ఇక్కడి ప్రజలు వందల సంవత్సరాల నుంచి గ్రామ పండుగగా జరుపుకుంటున్నారని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తాని తెలిపారు. కాగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకుగాను సర్పంచ్ పసునూరి మధుసూదన్‌తోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. అంతకు ముందు సర్పంచ్ మధుసూదన్ దంపతులు కాలబైరేశ్వర స్వామికి, ముత్యాలమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్రనాయక్, జెడ్పీటీసీ కేలోత్ సత్తమ్మ భిక్షపతినాయక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అందె యాకయ్య, మాజీ ఎంపీపీ రాము, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ రమేశ్, కో ఆప్షన్ మెంబర్ నసీర్, నాయకులు జక్కుల విజయమ్మ, వెంకట్ నారాయణ, పాంగు రంగం, శనిగరం కొంరయ్య, కుమార్ గౌడ్, సతీష్ గౌడ్, తహసీల్దార్ ఎంఏ అహ్మద్, ఎంపీడీవో డాక్టర్ రమేశ్, ఈవోపీర్డీ చంద్రశేఖర్, పీఆర్ ఏఈ కిరణ్ కుమార్ ఏపీవో కుమారస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...