భద్రకాళి బండ్ అద్భుతం..!


Wed,August 14, 2019 02:02 AM

వరంగల్, నమస్తేతెలంగాణ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉం దని, కాకతీయుల కళా సంపద ఉట్టిపడేలా బండ్‌పై ఆర్చీల నిర్మాణం అబ్బురపరిచేలా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భద్రకాళి బండ్‌ను కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. భద్రకాళి బండ్‌పై చేస్తున్న అభివృద్ధిని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆయన వివరించారు. మొదటి దశలో 1.1 కిలోమీటర్లు మేరకు భద్రకాళి బండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రెండో దశలో మరో 1.5 కిలోమీటర్ల బండ్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. భద్రకాళి చెరువును గోదావరి నీటితో నింపుతామని తెలిపారు. అలాగే పర్యాటకులకు కనువిందు చేసేలా చెరువులో 5 వాటర్ ఫౌంటేన్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే భద్రకాళి దేవాలయం గుట్టకు రాక్‌షో ప్రదర్శన చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన వి వరించారు. భద్రకాళి చెరువులో వాటర్ కర్టెన్ (నీటి తెర) వచ్చేలా ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసి దానిపై లెజర్‌షో ప్రదర్శన నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన ఎమ్మెల్యే కు వివరించారు. అధికారులతో కలిసి బండ్ పై హరీశ్‌రావు కలియతిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లోని భద్రకాళి బండ్ అభివృద్ధిని చూసి సిద్దిపేటలో బండ్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భ ద్రకాళి బండ్‌ను సందర్శించానన్నారు. రాష్ట్రం లో ఎక్కడా లేనివిధంగా మొదటి సారిగా భ ద్రకాళి బండ్‌పై సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏ ర్పాటు చేశారని, ఆదే తరహలో సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...