కామాంధులను శిక్షించేలా చర్యలు


Tue,August 13, 2019 03:21 AM

-వెన్నెల కుటుంబాన్ని ఆదుకుంటాం
-మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
-మృతురాలి కుటుంబానికి పరామర్శ
భీమారం, ఆగస్టు12: హన్మకొండ సమ్మయ్యనగర్ కాలనీలో లైంగికదాడికి గురైన ఆవేదనలో ఆత్మహత్య చేసుకున్న బాలిక సిరిగిరి వెన్నెల కేసును ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు ద్వారా విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఈ అమానుష ఘటనపై విచారం వ్యక్తం చేశారని, బాధిత కుటుంబాలకు ఓదార్పునివ్వాలని స్వయంగా ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. దీంతో సోమవారం మంత్రి దయాకర్‌రావు.. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు సిరంగి సునీల్‌కుమార్, మిరిదొడ్డి స్వప్నతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వారిని ఓదార్చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇటీవల చిన్నారి శ్రీహిత హత్య కేసులో నిందితుడికి శిక్ష పడినట్లే వెన్నెలపై లైంగిక దాడి చేసి వారికీ శిక్ష పడేలా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా, న్యాయపరంగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరంగల్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీలను వేస్తామన్నారు.

ఆడపిల్లల రక్షణకు షీటీంలను బలోపేతం చేస్తామని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇలాంటి ఘటనలను రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవస రం ఉందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. వెన్నెల లైంగిక దాడికి గురై అవమానభారంతో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించా రు. కార్పొరేటర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి తనవంతుగా సాయం అం దిస్తాన్నారు. వీరితో పాటు బాధిత కుటుంబ సభ్యులను హన్మకొండ ఏసీపీ శ్రీధర్, కేయూ, హన్మకొండ ఇన్‌స్పెక్టర్ల డేవిడ్‌రాజ్, బోనాల కిషన్ పరామర్శించి కేసుపై ఆరా తీశారు. సమ్మయ్య నగర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ఆదివారం నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సమ్మయ్య నగర్‌లో వివిధ ప్రజా సంఘాలు రాస్తారోకోలు నిర్వహించాయి. కేయూ ఎస్సైలు హరికృష్ణ, రవీందర్, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పెట్రోలింగ్‌పై మహిళల ఫిర్యాదు
వరంగల్ క్రైం: పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ వి ధుల్లో ఆలసత్వం వహిస్తున్నారని మంత్రి దయాకర్‌రావు దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. వెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయనతో మహిళలు కాసేపు తమ సమస్యలు చెప్పుకున్నారు. కాలనీల్లో పోలీసులు పెట్రోలింగ్ విషయం మరిచిపోయారని, ఫిర్యాదు చేస్తే త ప్పా.., కాలనీల్లోకి వచ్చే దిక్కులేదని మంత్రి ముందు వాపోయారు. కొత్తకొత్త వ్యక్తులు కాలనీల్లో కనిపిస్తున్నారని, వారి వల్ల ఇ బ్బందులు ఎదుర్కొంటున్నామని చె ప్పారు. దీంతో స్పందించి మంత్రి ప క్కనే ఉన్న హన్మకొండ ఏసీపీని కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు.

షీ టీం బృందాలు బలోపేతం
నగరంలో షీ టీం బృందాల ను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ దృష్టికి వరంగల్‌లో జరుగుతున్న ఘటనలను తీసుకెళ్లి హైదరాబాద్ తరహాలో సిబ్బందిని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపుతామని చెప్పారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...