ముస్లింలకు ఎమ్మెల్యే రాజయ్య శుభాకాంక్షలు


Tue,August 13, 2019 03:19 AM

ధర్మసాగర్, ఆగస్టు 12 త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం రాత్రి వేలేరు మండలంలోని పీచర లో వేలేరు మండల కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ జానీ కుటుంబంలో పండుగ సందర్భంగా వారితో మాట్లాడారు, వేలేరులో ఎండీ రహీమత్ షరీఫ్ కుటుంబానికి వెళ్ళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ ఆంగోతు సంపత్ నాయక్, వేలేరు, పీచర సర్పంచ్‌లు మాధవరెడ్డి, రవీందర్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, వేలేరు, వెంకటస్వామి, రాజిరెడ్డి, విజేందర్ రెడ్డి, ప్రసాద్, అమర్‌సింగ్, మండల నాయకులు, ముస్లింలు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...