రూ.1కే అంత్యక్రియల సౌకర్యాన్ని కల్పించాలి


Tue,August 13, 2019 03:18 AM

హసన్‌పర్తి, ఆగస్టు 12: పట్టణం ప్రజలకు 1 రూ.కే అంత్యక్రియల సౌకర్యాన్ని కల్పించేలా ఎమ్మెల్యే అరూరి రమేశ్ కృషి చేయాలని కోరుతూ సోమవారం పట్టణ సామాజిక కార్యకర్తలు శీలం యాదగిరి, అనుమాండ్ల విద్యాసాగర్ కోరారు. సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ పట్టణానికి ప్రభుత్వంచే శ్మశాన వాటికను ఏర్పాటు చేసి అందులో నిరుపేదల దహన సంస్కారాలు నిర్వహించేందుకు 1రూ.కే అంత్యక్రియలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.

దశాబ్ద కాలంగా హసన్‌పర్తి ప్రజలకు ఉమ్మడి శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేసినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి పట్టణ ప్రజలకు శ్మశాన వాటికతో పాటు 1రూ.కే అంత్యక్రియలు అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు భూబాధితుల సేవా సంఘం నాయకులు రవీందర్, వినియోగదారుల సేవా సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, సీపీఎం మండల కార్యదర్శి గుమ్మడిరాజులు రాములు, వివిధ కుల సంఘాల నాయకులు దాడి రాజు, సదానందం, సాంబయ్య, రవింద్రచారి, ఎస్టీ రాజు, ప్రభాకర్ ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...