అల్లా దయతో అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి


Tue,August 13, 2019 03:18 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, ఆగస్టు 12: అల్లా దయతో.. మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచా... సీఎం కేసీఆర్ చలువతో మంత్రిని అయ్యా అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మానుకోట జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జమామసీద్ ఆవరణలో ము స్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అల్లా దయతో పాలకుర్తి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు.

గతంలో ఏ పాలకులు ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, ఓటు బ్యాంక్‌గా వినియోగించుకున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సం క్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ముస్లింలు విద్యాపరంగా ముందుకుసాగాలని రాష్ట్రవ్యాప్తంగా వందలాది మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘతన టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈసందర్భంగా మసీద్‌కు వచ్చేసిన మంత్రి దయాకర్‌రావును ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, జమామసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండీ జలీల్, అమీర్, యాకూబ్‌పాషా, ఇమామ్, గుంశావళి, గఫార్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...