నేడు ప్రాక్టీసింగ్ స్కూల్‌లో విద్యార్థులకు శిక్షణ శిబిరం


Tue,August 13, 2019 03:18 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 12: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్‌లో ఈనెల 13న వల్లంపట్ల ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు సోమవారం తెలిపారు. ప్రతీ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులను శిబిరానికి పంపించాలని కోరారు. నివేదిత సంగీత ఉపాధ్యాయురాలు, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో శిక్షణలో నేర్చుకున్న పాటలను పంద్రాగస్టు వేడుకల్లో పాడుకునేందుకు వీలుగా ఉండాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...