విజ్ఞాన భాండాగారాలు


Tue,August 13, 2019 03:17 AM

భీమారం : విజ్ఞాన భాండగారాలు గంథ్రాలయాలని కిట్స్ కాలేజీ డీన్ అడ్మిన్ ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధిలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రంథాలయ పితమహుడు డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రంగనాథన్ చిత్రపటానికి ప్రొఫెసర్లు రమేశ్‌రెడ్డి, వెంకటేశ్, రాజ నరేందర్ రెడ్డి, కాలేజీ లైబ్రేరియన్ డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, వీరరెడ్డి, విజయ్‌కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కిట్స్ కాలేజీలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశామన్నారు. లైబ్రరీలో జాతీయ, అంతర్జాతీయ పరిశోధన గ్రంథాలు, ఈ-జర్నల్స్, ఈ-బుక్స్ సాంకేతిక రంగానికి చెందిన అన్నిరకాలు గ్రంథాలను కిట్స్ కాలేజీ లైబ్రరీలో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కిట్స్ గ్రంథాలయ సిబ్బంది నిరంజన్, సతీశ్, అరుణ్‌కుమార్, రాజు, సుమలత, సుధాకర్, పీఆర్‌వో ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...