విద్యాభివృద్ధిలో కీలకం


Tue,August 13, 2019 03:17 AM

వరంగల్ క్రైం : విద్యాభివృద్ధ్దిలో గ్రంథాలయా ల పాత్ర కీలకమని రిటైర్డ్ కేయూ లైబ్రేరియన్ ప్రొఫెసర్ రమణయ్య పేర్కొన్నారు. గ్రంథాలయ పితామహుడు ఎస్‌ఆర్ రంగనాథన్ 127వ జయంతిని పురస్కరించుకొని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో గ్రంథాలయాలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. అనంతరం ఉత్తమ లైబ్రేరియన్లను సత్కరించారు. కార్యక్రమంలో కేయూ లైబ్రరీ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ బాధ్యులు కృష్ణమాచార్య, కేయూ గ్రంథాలయ విభాగాధిపతి రాధికారాణి, ఇన్‌చార్జి సుజాత, టీఎస్ లైబ్రరీ అసొసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...