గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు


Tue,August 13, 2019 03:17 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 12: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, విద్యార్థులు తమ ఖాళీ సమయాలను గ్రంథాలయాల్లో గడపాలని కేయూ లైబ్రేరియన్ డాక్టర్ ఎస్ సుజాత అన్నారు. కేయూ కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా గ్రంథాలయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి చేసిన సూచనలు, ఆయన ఇచ్చిన సలహాలు గ్రంథాలయాల అభివృద్ధికి ముఖ్యసిద్ధాంతాలుగా నేటికీ ప్రస్తుతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మనిషి సాంఘిక, మానసిక అభివృద్ధి గ్రంథాలయంలో గడిపిన సమయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇస్సాక్ ప్రభాకర్, రాజు, సంజయ్, రోహన్, మనిచంద్ర పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...