నేడు పీడీఎస్‌యూ రాష్ట్ర సదస్సు


Tue,August 13, 2019 03:17 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 12: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 13న పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల గుండెలపై యూరేనియం తవ్వకాల పెనుభూతం అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు పీడీఎస్‌యూ(ఎస్) జిల్లా నాయకుడు మోడెం విక్రమ్ తెలిపారు. సోమవారం కేయూలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ అత్యంత సారవంతమైన అటవీ ప్రాంతమైన నల్లమల అటవీ ప్రాంతం జంతువులకు, మానవాళికి అత్యంత అనువైన ప్రాంతమని అన్నారు. కార్యక్రమంలో రాము, మహేశ్, వేమన్, ప్రశాంత్, శ్రీను, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...