రేపు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ మహాసభ


Tue,August 13, 2019 03:16 AM

న్యూశాయంపేట,ఆగస్టు12: టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ 9వ మహాసభలను హన్మకొండలోని పాపులర్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ తెలిపారు. సోమవారం బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించకుండా అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను తెప్పించాలని, కార్మికులకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షుడు యాదగిరి, హన్మకొండ, వరంగల్-1డిపో అధ్యక్షులు ఎల్లయ్య, విజయ్, వరంగల్-2డిపో కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...