పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించాలి


Tue,August 13, 2019 03:16 AM

-వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత రమణాచక్రవర్తుల
సుబేదారి, అగస్టు 12: పిల్లల్లో మానసిక వికాసాన్ని పొందించాలని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత రమణాచక్రవర్తుల పేర్కొన్నారు. హన్మకొండ కేఎల్‌ఎన్‌రెడ్డికాలనీ ఎస్‌ఎంఆర్ ప్లే స్కూల్‌లో సోమవారం హోమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రమణాచక్రవర్తుల హాజరై మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో చదువులతో పిల్లలు తీవ్రమానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీనిని అధిగమించడానికి వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించాలని అన్నారు. ఇందుకు పాఠశాలల్లో భక్తిభావాన్ని కలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముక్తీశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...