చీకటైన వెన్నెల


Mon,August 12, 2019 03:23 AM

-మైనర్‌పై సామూహిక లైంగికదాడి
-అవమాన భారంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య
-పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు..?
-పరారీలో మరో ఇద్దరు..!
-కఠిన శిక్ష విధించాలని డిమాండ్
-నా మనవరాలిని పొట్టనపెట్టుకున్నారు
-చిన్నారి నాయనమ్మ

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : మరో దారుణం. వెన్నెలను చీకటి చేసిన ఘాతుకం. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం. శనివారం ఘటన ఆదివారం ఉరితో వెలుగులోకి వచ్చిన చీకటి కోణం. వెన్నెల బతుకు బుగ్గిపాలైన దారుణం. తొమ్మిదినెలల పసికందు శ్రీహిత ఉన్మాది ఘాతుకానికి బలైన 50 రోజులకే వరంగల్ కోర్టు సదరు ఉన్మాదికి ఉరిశిక్ష ఖరారు చేసిన రెండు రోజులకే జరిగిన దారుణం. ముగ్గురు దుండగులు తొమ్మిదో తరగతి చదివే చిన్నారిని చెరిపేసిన అమానుష ఘటన. మరో ఇద్దరిపైనా అనుమానం. మదపుటేనుగుల బలత్కారానికి బలైన బాలిక. తండ్రి మరణించగా తల్లి ఇల్లొదిలి వెళ్లిపోతే నాయినమ్మ, తాతయ్యల దగ్గర ఉండి చదువుకుంటున్న బాలిక సిరిగిరి వెన్నెల (15) సామూహిక అత్యాచారానికి గురై, తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని ఉరిపోసుకొని ప్రాణాలు విడిచిన వైనం. నగరంలో మరోసారి విషాదగీతం. శ్రీహిత నెత్తుటి మరకలు ఆరిపోకముందే చీకటైన వెన్నెల జీవితం ఇదీ.

అసలేం జరిగింది?
హన్మకొండ పట్టణంలోని సమ్మయ్యనగర్‌కు చెందిన సిరిగిరి సారంగపాణి. ఏడేండ్ల క్రితమే మరణించారు. తల్లి సాలమ్మ మూడేండ్ల క్రితం ఇల్లొదిలి వెళ్లిపోయింది. కొడుకూకోడలు లేకపోవడంతో ఉన్న మనవరాలిని సాదుకుంటూ తమకు వృద్ధాప్యంలో చేయూతనిస్తుందని భావించిన వెన్నెల ఉరిపోసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సమ్మయ్యనగర్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిరిగిరి వెన్నెల (15)ను శనివారం ఉదయం హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ అలియాస్ బిట్టూ సమ్మయ్యనగర్ నుంచి దాదాపు 11 గంటల ప్రాంతంలో నీతో మాట్లాడే పని ఉందని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చింతగట్టు-ఎర్రగట్టు గుట్ట సమీపంలోని మామిడితోటకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ బిట్టూ స్నేహితులైన కొయ్యడ తిరుపతి (20), కొయ్యడ రాకేశ్ ఉన్నారు.

ముగ్గురూ కలిసి వెన్నెలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం దాదాపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బిట్టూ వెన్నెలను తీసుకుని సమ్మయ్యనగర్‌లో ఇంటి దగ్గర వదిలివెళ్లాడు. వెన్నెల ఇంటికి రావడంతో సొమ్మసిల్లి పడుకోవడం, తూలుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఏం జరిగిందో చెప్పు అని నిలదీశారు. ఎటు పోయినవు. పొద్దున అనగాపోయి ఇప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్లావు అని నిలదీశారు. దీంతో వెన్నెల తనకు జరిగిన ఘోరాన్ని వివరించి కన్నీళ్లపర్యంతమైంది. రాత్రి ఇంటి దగ్గర బంధువులు చేరి ఇంత దారుణం జరిగిందా? తల్లీదండ్రీ లేని పిల్ల. ఇలా అయితే తన భవిష్యత్ ఎలా అని ఆవేదనకు గురయ్యారు. ఆందోళన చెందారు. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించారు. తనకు జరిగిన అవమాన భారానికి తట్టుకోలేక వెన్నెల ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...