భద్రకాళిని దర్శించుకున్న క్రిబ్‌కో ఎండీ సాంబశివరావు


Mon,August 12, 2019 03:18 AM

మట్టెవాడ, ఆగస్టు 11: శ్రీభద్రకాళి అమ్మవారిని న్యూడిల్లీకి చెందిన క్రిబ్ కో సంస్థ ఎండీ ఎన్ సాంబశివరావు, మార్కెటింగ్ డైరెక్టర్ వీఎస్ శిరోహి తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. వారికి ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రాలను సమర్పించి తీర్థప్రసాద వితరణ గావించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో టీఎస్ రావు, ఎస్ రామిరెడ్డి, కేవీ రావు తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...