సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


Mon,August 12, 2019 03:18 AM

వరంగల్ చౌరస్తా, ఆగస్టు 11: తెలంగాణ వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి మహాత్మాగాంధీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికైనట్లు న్యూఢిల్లీలోని ఐకాన్ అచీవర్స్ కౌన్సిల్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ సేవా, సామాజిక కార్యక్రమాలతో పాలుగా, సామాజిక స్ఫృహ కలిగిన కలిగిన అంశాలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలల్లో భాగంగా 2019 అక్టోబర్ 12వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, వాటి పరిరక్షణ, వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పురస్కారాన్ని అందించి తనపై మరింత బాధ్యతను పెంచిన ఐకాన్ అచీవర్స్ కౌన్సిల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చక్రపాణిని పలు వినియోగదారుల మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...