సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


Mon,August 12, 2019 03:17 AM

మామునూరు, ఆగస్టు 11 : నగరంలోని ఆరో డివిజన్ మామునూరుకు చెందిన నీరటి రవీందర్‌రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా బాధితుడు సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ అతడి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష మంజూరు చేయించాడు. ఆ చెక్కును ఎమ్మెల్యే ఆయన నివాసంలో ఆదివారం మామునూరు టీఆర్‌ఎస్ నాయకుల సమక్షంలో రవీందర్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల నాగేశ్వర్‌రావు, జయశంకర్, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సాంబయ్య, శ్రీనివాస్, మల్లేశం, కోటి, యాకయ్య, రాజమౌళి, రవి తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...