ముల్కనూర్ అభివృద్ధికి సహకరించాలి


Mon,August 12, 2019 03:17 AM

ఎల్కతుర్తి(భీమదేవరపల్లి) : మండలంలోని ముల్కనూర్ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్, పలువురు వార్డు సభ్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కోరారు. ఆదివారం ఎంపీ నివాసంలో కలుసుకుని పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. అభివృద్ధికి సహకరించాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలోనే భీమదేవరపల్లి మండలంలో పర్యటిస్తానని తెలిపినట్లు వారు చెప్పారు. ఎంపీని కలిసిన వారిలో సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సుద్దాల రఘు, వార్డు సభ్యులు మాడుగుల ప్రవీణ్, అలుగు సంపత్, మాడుగుల రమేష్, దొండ శ్రీనాథ్, బీజేపీ నాయకులు దొంగల కొమురయ్య తదితరులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...