వ్యాయామశాల కోసం ఎంపీకి వినతి


Mon,August 12, 2019 03:17 AM

ఎల్కతుర్తి(భీమదేవరపల్లి) : భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు వ్యాయామశాల మంజూరు చేయాలని కోరుతూ ముల్కనూర్ ఆదర్శ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు. ముల్కనూర్ 15వేల జనాభాతో అతిపెద్ద కేంద్రంగా ఉందని, అయితే ఇక్కడ వ్యాయామశాల లేకపోవడంతో యువత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు రిక్రూట్‌మెంట్లలో విఫలమవుతున్నారని చెప్పారు. ఎంపీ సానుకూలంగా స్పందించి నిధులు విడుదలవ్వగానే మొదటగా ముల్కనూర్‌కు వ్యాయామశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో ఆదర్శ సేవా సమితి అధ్యక్షుడు ఎదులాపురం తిరుపతి, గౌరవ అధ్యక్షుడు, సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, మాడ్గుల రాజుకుమార్, భూపతి విజయ్, కర్ణకంటి రామకృష్ణ, బీజేపీ అధ్యక్షుడు దొంగల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...