పంటలో రసాయన ఎరువులు తగ్గించాలి


Mon,August 12, 2019 03:16 AM

కమలాపూర్: పత్తిపంటలో రసాయన ఎరువులను తగ్గించాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకే కో ఆర్డినేటర్ మల్లేశం రైతులను కోరారు. ఆదివారం మండలంలోని పంగిడిపల్లిలో రైతులకు ఉత్తమ పత్తి యాజమాన్య పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి పంటలో అధిక మోతాదులో రసాయన మందులు, ఎరువులు వాడటం వలన భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుందన్నారు. పత్తి పంటలో బొట్టు పెట్టే పద్దతి, పసుపు రంగు స్టిక్కర్, వేపనూనె వాడకం, లింగాకర్షక బుట్టలు వాడటం వలన గులాబీ రంగు పురుగును అరికట్టవచ్చన్నారు. ఎరుపు రంగు గుర్తు కల్గిన రసాయన మందులు వాడటం వలన పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలికె శ్రీనివాస్, కేవీకే సిబ్బంది రాజేందర్, రైతులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...