సీసీ కెమెరాలతో కేసుల సత్వర పరిష్కారం


Mon,August 12, 2019 03:16 AM

ఎల్కతుర్తి : గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో ఆ కేసు సత్వరమే పరిష్కరించవచ్చని సీఐ శ్రీనివాస్‌జీ పేర్కొన్నారు. మండలంలోని దండేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, సర్పంచ్ పుట్ట ప్రమీల, ఎంపీటీసీ బోయినపల్లి భవానీ, ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, పుట్ట ప్రతాప్, బోయినపల్లి దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...