తెన్నేటి సుధ కథల పుస్తకావిష్కరణ


Mon,August 12, 2019 03:15 AM

న్యూశాయంపేట, ఆగస్టు11: నగరంలోని కిషన్‌పుర వాగ్దేవి కళాశాలలోని ఆడిటోరియంలో తెన్నేటి సుధ కథలు పేర డాక్టర్ తెన్నేటి సుధ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరేదే సాహిత్యమని, సుధ ఆసృహతో రాసిన మొత్త రథలు ప్రతి పాఠకుడిని ఆకట్టుకుంటాయని అన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ ఫ్లొటో, అరిస్టాటిల్ కాలం నుంచి సాహిత్యమే సమాజ పునర్నిర్మాణంలోప్రముఖపాత్ర వహించిందన్నారు. అనంతనం డాక్టర్ సుధ తన తల్లిదండ్రులైన విద్వాన్ తెన్నేటి అహల్యాదేవి ఆదర్శదంపతుల పేరిట ఏర్పాటు చేసిన ప్రథమ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రసిద్ధ రచయిత, కవి ప్రొఫెసర్ రామాచంద్రమౌళి లలిత దంపతులకు ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లంకా శివరామప్రసాద్, కృష్ణమూర్తి, డాక్టర ఎన్‌వీఎన్ చారి, తౌటం శ్రీనివాస ఉమామహేశ్వర్‌రావు, వీఆర్ విద్యార్థి, రామశాస్త్రి, కృష్ణారావు, మహ్మద్ సిరాజ్, రాజ్‌మోహన్, శ్రీనివాస్, చంద్, మురళీధర్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...