ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి


Sun,August 11, 2019 03:39 AM

మడికొండ, ఆ గస్టు 10: ప్రతి ఒ క్కరు విధిగా మొ క్కలు నాటాలని గురుకులాల ఆర్సీ వో దాసరి ఉమామహేశ్వరి సూచించారు. మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం హరితహారం నిర్వహించారు. కార్యక్రమానికి ఉమామహేశ్వరి హా జరై పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ కృతమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మా ట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని చెప్పా రు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

కా ర్యక్రమంలో టీజీపీఏ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చాతళ్ల సదానందం, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు రాపాక మంజుల, సభ్యులు పసుల అశోక్, అకినెపల్లి ప్రసాద్, ప్రవీణ్‌కుమార్, రాపాక విజయ, దర్శనాల జంపయ్య, రాణి, మహేందర్, ఉపా ధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...